Greater Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం
- గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కూటమి వశం..
- మేయర్ హరివెంకట కూమారిపై నెగ్గిన అవిశ్వాసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Greater Visakha Mayor: ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్ హరివెంకట కూమారిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఇక, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజార్టీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖ పీఠం కూటమి వశం అయ్యింది..
Read Also: Koramutla Srinivasulu: సాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు.. టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు..!
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.. కోరం సరిపోవడంతో సమావేశాన్ని ప్రారంభించారు ఇంచార్జ్ కమిషనర్, విశాఖ కలెక్టర్ హరేంధీర ప్రసాద్.. ఆ తర్వాత కూటమి.. విశాఖ మేయర్ పీఠం దక్కించుకుంది.. దీంతో, మేయర్ హరివెంకట కూమారి ఇక, మాజీ కానున్నారు.. గత నెల రోజులుగా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. ఓవైపు కూటమి ప్రయత్నాలు.. మరోవైపు.. తిరిగి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న వైసీపీ ప్రయత్నాలు ఉత్కంఠగా మారిపోయాయి.. కానీ, గ్రేటర్ పీఠాన్ని కూటమి దక్కించుకోవడంతో.. ఆ ఉత్కంఠకు తెరపడింది.. కార్పొరేటర్లు చేతులు ఎత్తడం ద్వారా.. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. దీంతో, మేయర్ తన పదవిని కోల్పోయారు.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!