Site icon NTV Telugu

Greater Visakha Mayor: గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠం కూటమి వశం

Greater Visakha Mayor

Greater Visakha Mayor

Greater Visakha Mayor: ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్దదైన గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్‌ హరివెంకట కూమారిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్‌ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఇక, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజార్టీని కూటమి సాధించడంతో గ్రేటర్‌ విశాఖ పీఠం కూటమి వశం అయ్యింది..

Read Also: Koramutla Srinivasulu: సాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు.. టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు..!

మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.. కోరం సరిపోవడంతో సమావేశాన్ని ప్రారంభించారు ఇంచార్జ్ కమిషనర్‌, విశాఖ కలెక్టర్‌ హరేంధీర ప్రసాద్‌.. ఆ తర్వాత కూటమి.. విశాఖ మేయర్ పీఠం దక్కించుకుంది.. దీంతో, మేయర్‌ హరివెంకట కూమారి ఇక, మాజీ కానున్నారు.. గత నెల రోజులుగా గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.. ఓవైపు కూటమి ప్రయత్నాలు.. మరోవైపు.. తిరిగి మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలన్న వైసీపీ ప్రయత్నాలు ఉత్కంఠగా మారిపోయాయి.. కానీ, గ్రేటర్‌ పీఠాన్ని కూటమి దక్కించుకోవడంతో.. ఆ ఉత్కంఠకు తెరపడింది.. కార్పొరేటర్లు చేతులు ఎత్తడం ద్వారా.. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. దీంతో, మేయర్‌ తన పదవిని కోల్పోయారు.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..

Exit mobile version