విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.. క్రికెట్ బుకీలు అపార్ట్మెంట్లే స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో.. స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరమంతా జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 180 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. మిగతా వాళ్ల అరెస్టు కోసం రంగం సిద్ధం చేశారు పోలీసులు.. క్రికెట్ బెట్టింగ్ ముఠాలో పెద్ద తలకాయలు, కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారంతా.. విదేశాలకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
Read Also: Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం..
ఎన్టీవీతో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది యువకులు నష్టపోయారని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాకి సహకరిస్తున్న అధికారులపై దృష్టి పెట్టామని సీపీ తెలిపారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశాం.. క్రికెట్ బెట్టింగ్‌లో ఎలాంటి వ్యక్తుల పాత్ర ఉన్న ఉపేక్షించేది లేదన్నారు. రానున్న ఐపీఎల్ సీజన్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్‌లైన్ ముఠాలను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు… అయితే విశాఖ సిటీ ప్రజలే తమకు ఇన్ఫార్మర్స్ అని ఎక్కడ బెట్టింగ్ నిర్వహించిన సమాచారం ఇవ్వాలని కోరారు.
Read Also: US Immigration Raid: ట్రంప్ ఆదేశం.. 538 మంది అక్రమ చొరబాటుదారుల అరెస్ట్