Site icon NTV Telugu

Pawan Kalyan: నేడు ‘సేనతో సేనాని’ సభ.. పవన్‌ కల్యాణ్‌ ప్రసంగంపై ఆసక్తి..!

Pawan Kalyan Article 370

Pawan Kalyan Article 370

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఓవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అందులో భాగంగా.. విశాఖ వేదికగా ‘సేనతో సేనాని’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.. సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేసింది జనసేన.. పార్టీ భవిష్యత్తు, కూటమి నేతల మధ్య సఖ్యత, సుపరిపాలన వంటి అంశాలపై పవన్ ప్రసంగం కొనసాగనుండగా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్‌ కల్యా్ణ్.. ప్రసంగంలో తన దూకుడు చూపిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది..

Read Also: Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ

ఇక, విశాఖలో రెండో రోజు సేనతో సేనాని కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలతో భేటీ అయిన పవన్, పార్టీ అభివృద్ధి, రాజకీయ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు గురించి క్లియర్ గా మాట్లాడారు.. గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే, నేను మాటలు పోగేసుకుంటున్నాను అంటూ మొదలెట్టిన పవన్‌ కల్యాణ్‌.. జనసేన భావజాలమే తనను, కార్యకర్తలను ఒకే దగ్గరికి తెచ్చిందని అన్నారు. ఉద్దానం సమస్య తన దృష్టికి వచ్చిన తర్వాత.. అది కేవలం రాజకీయ సమస్య కాదు, సోషియో పొలిటికల్ కమిట్మెంట్‌తోనే పరిష్కారం సాధ్యమవుతుంది అని స్పష్టంచేశారు. సినిమా ద్వారా ప్రజలకు చేరువైన తనకు.. పార్టీ ఆవిర్భావం రోజుల్లో జనం తాకిడి ఫంక్షన్‌లా ఉండేదని గుర్తుచేసుకున్నారు. జనం మీద పడిపోవడం నాకు అడ్డంకిగా మారింది అన్నారు. కానీ, భావజాలం కోసం మీరు చేసిన త్యాగం వ్యక్తిగతం కాదు.. పార్టీ కోసం చేసిన సమర్పణ అని పవన్ వ్యాఖ్యానించారు.

Read Also: Land Grabbing Mafia: హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న కబ్జారాయుళ్లు.. మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు!

2019 ఎన్నికల ఓటమిని కూడా పవన్ నేరుగా ప్రస్తావించారు. ఆ ఓటమి నాకు అవమానకరమైనదే. కానీ ఆ ఓటమి తర్వాత కూడా నేను ఆనందంగా ఫీల్ అయ్యాను.. ఎందుకంటే భగవంతుడు నాకు కష్టాల అసలు రూపం చూపించాడు. అవమానాలు మోసేవాడు ముందుకు వెళ్లలేడు. ఆశయాలు మోసేవాడే ముందుకు వెళ్తాడు అని స్పష్టం చేశారు.తన రాజకీయ ఆలోచనలు 21 ఏళ్ల వయసులోనే మొదలయ్యాయని.. కమ్యూనిజం చదివిన అనుభవం ఉందని చెప్పారు. 2019లో ఓడితే అందరూ నవ్వుతారని నాకు ముందే తెలుసు. కానీ, ఓటమి తర్వాత మిగతావారిని ట్రాక్‌లో పెట్టడం పెద్ద సవాలుగా మారింది అని అన్నారు. పార్టీ ఎదుగుదలకు ఉదాహరణగా నాదెండ్ల మనోహర్‌ను ప్రస్తావించారు పవన్. 2019లో పీఏసీ చైర్మన్‌గా ఉన్న మనోహర్.. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇది మనం ఎక్కడి నుంచి ఎక్కడికీ వచ్చామనే దానికి నిదర్శనం అని అన్నారు. ఇక, జనసేన స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ దిశ, కఠినమైన నిర్ణయాల అవసరం వంటి అంశాలను కార్యకర్తలకు పవన్ స్పష్టంగా వివరించారు. ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది కార్యకర్తలు, ముఖ్యనేతల సేనతో సేనాని బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ఏం చెపుతారు అనేదానిపై ఆసక్తి నెలకుంది.

Exit mobile version