Site icon NTV Telugu

Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు

Visakharain

Visakharain

విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూలైన్‌లో నిలబడ్డారు. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువున బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు. సమయానికి బస్సులు రాకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి కొండ కిందనే ఉండిపోయామని.. ఇంకెన్ని గంటలు కింద ఉండాలంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు భక్తులు రద్దీ పెరగడంతో బస్టాండ్ ఏరియా అంతా కిటకిటలాడుతోంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘటనతో అధికారులు పరిమితి సంఖ్యలో భక్తులు అనుమతి ఇస్తున్నారు. మరోసారి అలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ దంపతుల మృతి

సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ దంపతులతో పాటు ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం విచారకరం. ఇక మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశంచింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Jagga Reddy : మేనమామ ప్రశంసల కోసమే ఎదురుచూస్తున్నావా ఇంకా..?

Exit mobile version