NTV Telugu Site icon

CPI Narayana: రాజకీయాలలో స్పష్టమైన వైఖరి ఉండాలి.. దొంగాటలు ఆడకూడదు

Cpi Naraya Na

Cpi Naraya Na

విశాఖ వేదికగా మూడు రోజుల పాటు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రోజు సమావేశాలకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఇక, ఎన్నికల ఫలితాలపై సమీక్ష, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు.. ప్రశ్నించే గొంతు నొక్కేశారు, రాజకీయ పార్టీల నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయలేదు.. అందుకే సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘోరంగా ఓడిపోయారు.. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి పర్యటనకు వచ్చిన చెట్లు నరికేసి పర్యావరణ విధ్వాంసానికి పాల్పడ్డారు అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం

ఇక, న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వలనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రాజకీయాలలో స్పష్టమైన వైఖరి ఉండాలి.. దొంగాటలు ఆడకూడదు.. అసెంబ్లీలో, పార్లమెంట్ లో చట్టం ప్రకారమే ప్రతిపక్ష హోదా వస్తుంది.. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండాలో నిర్మించిన భవనాలు చూడటానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదు.. నేను కోర్టు అనుమతితో నిర్మాణాలు పరిశీలించడానికి వెళ్ళాను.. విశాఖకు తలమానికమైన ఋషికొండాను వైసీపీ ప్రభుత్వం బొడిగుండు కొట్టేసింది.. నిజంగా టూరిజం కోసం అయితే ఋషికొండాలో అంత విలాసవంతమైన ప్యాలస్ ను నిర్మించాల్సిన అవసరం లేదని నారాయణ అన్నారు.

Read Also: Google Maps: గూగుల్ తల్లిని నమ్ముకుంటే, అడవిలో 11 గంటలు ముప్పతిప్పలు పెట్టింది..

అయితే, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఋషికొండాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. ఋషికొండాపై నిర్మాణాలకు పెట్టిన డబ్బులు పోలవరం ప్రాజెక్ట్ పై పెట్టివుంటే బాగుండేది.. జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. ప్రజాధనంపై బాధ్యతారహితంగా వ్యవహరించారు.. తప్పక జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించాల్సిందే అని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఋషికొండా భవనాలను ప్రజా ప్రయోజనాలు కోసం వినియోగించాలి అని నారాయణ చెప్పుకొచ్చారు.