Praja Shanti Party: ప్రజాశాంతి పార్టీకి గుర్తు కేటాయింపు.. ఏంటో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ పార్టీకి ఎన్నికల సంఘం ‘కుండ’ గుర్తు కేటాయించినట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతామన్నారు.
Read Also: Nallapareddy Prasanna Kumar: బంగారంగా తీసుకోండి.. తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయండి..!
Also Read
ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోతున్నారని.. గ్లాసులు పగిలి పోయాయి. సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు. కోర్టులో కేసు వేసి కుండ గుర్తు సాధించామని అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీలు ద్వారా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ప్రజలు మోడీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చారు. ప్రజా శాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు.
Read Also: Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?
ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రాని వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని కేఏ పాల్ తెలిపారు. రుషికొండలో కొండ మాయం చేశారని.. కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారని.. కంపెనీలు అహ్మదాబాద్ తరలిపోతున్నాయని తెలిపారు. బొత్స సత్యనారాయణ కుటుంబం అక్కడ దోచుకుని ఇప్పుడు విశాఖ వచ్చారు అని ఆరోపించారు. కాగా.. ఈ సమావేశంలో పార్టీ నాయకులు యేసు పాదం, శుభాకర్, బాబు రావు, జిలుకర రవి కుమార్, బాబుజీ రావు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్‌లో జరిగినట్లే భారత్‌లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్‌చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!