తమ పార్టీకి ఎన్నికల సంఘం ‘కుండ’ గుర్తు కేటాయించినట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. విశాఖలోని రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి కుండ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కుండలు తయారు చేసే కుమ్మరి మాదిరిగానే తాను కూడా ప్రజలు జీవితాలు తీర్చి దిద్దుతామన్నారు.
Read Also: Nallapareddy Prasanna Kumar: బంగారంగా తీసుకోండి.. తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేయండి..!
ఫ్యాన్లకు ఉరి వేసుకుని చనిపోతున్నారని.. గ్లాసులు పగిలి పోయాయి. సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు. కోర్టులో కేసు వేసి కుండ గుర్తు సాధించామని అన్నారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉపాధి స్టీల్ ప్లాంట్ అనుబంధంగా వెయ్యి కంపెనీలు ద్వారా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ప్రజలు మోడీ, కేసీఆర్, జగన్ కు అవకాశం ఇచ్చారు. ప్రజా శాంతి పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలి అని కోరారు.
Read Also: Kim Jong Un: కిమ్ రహస్య ప్రేమికురాలు ఈమేనా..? ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉందా..?
ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రాని వారు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని కేఏ పాల్ తెలిపారు. రుషికొండలో కొండ మాయం చేశారని.. కుటుంబ, కుల పాలనకు చరమ గీతం పాడాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేస్తున్నారని.. కంపెనీలు అహ్మదాబాద్ తరలిపోతున్నాయని తెలిపారు. బొత్స సత్యనారాయణ కుటుంబం అక్కడ దోచుకుని ఇప్పుడు విశాఖ వచ్చారు అని ఆరోపించారు. కాగా.. ఈ సమావేశంలో పార్టీ నాయకులు యేసు పాదం, శుభాకర్, బాబు రావు, జిలుకర రవి కుమార్, బాబుజీ రావు, తదితరులు పాల్గొన్నారు.