Site icon NTV Telugu

Political Heat in Visakhapatnam: విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్..! కూటమిలో కుదరని ఏకాభిప్రాయం..

Political Heat In Visakhapa

Political Heat In Visakhapa

Political Heat in Visakhapatnam: గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం చుట్టూ రాజకీయం రసకందాయంలో పడింది. అవిశ్వాసం నెగ్గితే మేయర్, డిప్యూటీ మేయర్ పంపకాలపై కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. డిప్యూటీ మేయర్ పై క్లారిటీ రాకుండా క్యాంప్ రాజకీయాలకు వెళ్లలేమని జనసేనలో సగం మంది కార్పొరేటర్లు తేల్చేశారు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు., క్యాంప్ రాజకీయాలు దేశం దాటేయడంతో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో మకాం వేస్తే.. వైసీపీ తన వర్గాన్ని శ్రీలంకలో మోహరించింది. కమ్యూనిస్టు పార్టీలకు ఇద్దరు సభ్యులు ఉండగా.. అవిశ్వాసం ఓటింగ్ కు దూరంగా ఉంటారని సమాచారం. ఇక, ఈ నెల 19వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్షలో నెగ్గుతారా..? లేదా..? అనేది అప్పుడు తేలనుంది.. మ్యాజిక్ ఫిగర్ 74 కాగా ఇప్పటికీ కూటమికి రెండు నుంచి మూడు ఓట్లు అవసరం పడనున్నాయి..

Read Also: Kangana Ranaut: మేడం కొంచెం చూసి మాట్లాడండి.. బీజేపీ ఎంపీకి విద్యుత్ శాఖ కౌంటర్

మొత్తంగా గ్రేటర్ విశాఖలో పొలిటికల్ హీట్ పెరుగుతంది.. మలేషియాలో టీడీపీ.. శ్రీలంకలో వైసీపీ శిబిరాలు ఏర్పాటు చేయగా.. క్యాంప్ రాజకీయాలపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. దీనికి ప్రధాన కారణం.. డిప్యూటీ మేయర్ పై కూటమిలో పంచాయితీ తేలకపోవడమే.. అయితే, జనసేన కార్పొరేటర్ల మలేషియా టూర్ కు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.. కానీ, క్యాంప్ కు వెళ్లేందుకు సగం మంది జనసేన కార్పొరేటర్లు అంగీకరించడం లేదు.. ప్రస్తుతం కౌన్సిల్ లో జనసేన పార్టీ బలం 11.. అవిశ్వాస రాజకీయాలకు దూరంగా ఉండాలని కమ్యూనిస్టు పార్టీలు నిర్ణయం తీసుకున్నారి తెలుస్తుండగా.. ఇప్పుడు గ్రేటర్‌ విశాఖ పాలిటిక్స్‌ మాత్రం రంజుగా మారిపోతున్నాయి..

Exit mobile version