Visakha Land Scam: విశాఖపట్నంలో భూముల వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మాజీ సైనికులు, డీ-పట్టా అసైన్డ్ భూముల ఆక్రమణ, ఎన్ఓసీ అక్రమంగా జారీపై విచారణకు సీసీఎల్ఏకు ఆదేశించారు. వీటి వెనుక రాజకీయ నేతలు, సీనియర్ ఐఏఎస్, రెవెన్యూ అధికారుల పాత్రపై గతంలో ఆరోపణలు వచ్చాయి. విశాఖ భూములను కాపాడాలని, అక్రమాలపై విచారణ చేయాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గత నెలలో లేఖ రాశాడు.
Read Also: Haider Ali: యువతిపై అత్యాచారం.. మ్యాచ్ మధ్యలోనే పాక్ స్టార్ క్రికెటర్ అరెస్ట్!
ఇక, విశాఖ భూములపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి మండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యనారాయణ లేఖ రాశారు. మొత్తానికి సమగ్ర విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్రమాలు, ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఎ)కు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు.