Guinness Record Event of Surya Namaskar: సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఈ రికార్డు ప్రకటించనున్నట్టు వెల్లడించారు.. ఇక, జూన్ 21వ తేదీ తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.. వారానికి ఒక రోజు యోగా కచ్చితంగా అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.. అయితే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రధాని నరేంద్ర మోడీకి కానుకగా ఇచ్చాం అన్నారు మంత్రి లోకేష్.. ఇక్కడకు వచ్చిన పిల్లల కమిట్మెంట్ చాలా సంతోషంగా అనిపించింది.. మా అబ్బాయికి కూడా మీలాంటి శిక్షణ అవసరం అనిపిస్తోందన్నారు.. ఒకే పిలుపుతో ప్రపంచం మొత్తం మనవైపు చూసే విధంగా చేసినందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు లోకేష్..
Read Also: Konda Surekha: ఆయన నల్లికుట్ల మనిషి.. నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు..
ఇది మనందరం గర్వపడాల్సిన రోజు.. యావత్ భారత్ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం విశాఖవైపు చూసిన రోజుగా అభివర్ణించారు లోకేష్… గతంలో ఎప్పుడూ లేని విధంగా గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారు.. 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం గిన్నిస్ రికార్డు.. ఈ రికార్డును శనివారం ప్రకటిస్తారని తెలిపారు… విద్యార్థులందరికీ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు తరఫున అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్.. యోగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.. ఈసారి విశాఖపట్నంలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీని కోరినట్టు వెల్లడించారు.. ఇక, రేపు 5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్..
