సూర్య నమస్కారలాలో కొత్త రికార్డు సాధించారు గిరిజన విద్యార్ధులు.. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది.. గిన్నిస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి 25 వేల మంది గిరిజన విద్యార్థులు రికార్డు సృష్టించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. విద్యార్థులను అభినందించారు.