NTV Telugu Site icon

Minister Nadendla Manohar: ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశం.. మంత్రి మనోహర్‌ కీలక వ్యాఖ్యలు..

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు అని స్పష్టం చేశారు.. BNS పరిధిలో వున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలి… తనిఖీలు, దాడుల కోసం పటిష్టమైన సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కావాలి.. అక్రమ రవాణాను న్యాయ స్థానంలో రుజువు చేసేందుకు త్వరితగతిన పరీక్షలు చేయించి ల్యాబ్ రిపోర్ట్ లు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం… ఇప్పటి వరకు లక్షా 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

Read Also: Storyboard: 2 నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. 6 లక్షల కోట్ల ఆదాయం

కాగా, PDS అక్రమాలను అణచివేయాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అధికారులతో విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధ్యానం సేకరణ, సమస్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కల్గిన ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందివ్వాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..

Show comments