Fire Accident: విశాఖపట్నంలోని నగర శివార్లో గల ఐటీసీ గోడౌన్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. సుమారు 75 కోట్ల రూపాయల ఆస్థి నష్టం జరిగినట్టు యాజమాన్యం ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీటిలో దాదాపు రూ. 50 కోట్లు విలువైన సిగరెట్ ప్రొడక్ట్స్ వున్నాయి. మిగిలిన ఆహార ఉత్పత్తులుగా యాజమాన్యం పేర్కోంది. ఆనందపురం మండలం గండిగుండం దగ్గర లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగేళ్ళ క్రితం గోడౌన్ ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన బాబీ ఘోష్ సహా మరికొంత మంది లీజుదారులు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో సిబ్బంది వెళ్ళిపోయారు. కంప్లీట్ గా లాక్ చేసిన గోడౌన్ లో నుంచి పొగలు వస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
Read Also: Rahul Sipligunj : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
అయితే, సిగరెట్స్, కాస్మోటిక్స్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు దాదాపు 8 గంటల పాటు శ్రమించిన తర్వాత కానీ మంటలు అదుపులోకి రాలేదు.. వేడి తీవ్రతకు ఐరన్ గడ్డర్లు కరిగిపోయి గోడౌన్ పైభాగం మొత్తం కూలిపోయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కావడంతో డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. వివిధ కోణాల్లో దర్యాప్తు కోసం పోలీసులు రెడీ అవుతున్నారు.