Minister Anitha: రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా యువ ఖైదీలైన 30 మందితో పాటు జైళ్లశాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించాం.. యువత మంచి, చెడులను తెలుసుకోవాలని సూచించింది. తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనం అయిపోతాయని వెల్లడించింది. తమ బంగారు భవిష్యత్త్ ను యువత నాశనం చేసుకోకండి అని హోంశాఖ మంత్రి అనిత పిలుపునిచ్చింది.
Read Also: CPI Narayana: కేంద్రం కటాక్షం లేకపోతే జగన్ ఇన్ని రోజులు కోర్టుకు పోకుండా ఉంటారా..?
ఇక, ఖైదీల జీవితాల్లో మార్పు రావాలి అని మంత్రి అనిత పేర్కొనింది. బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం.. వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీపౌర్ణమి జరుపుకోవాలి అని కోరింది. తప్పుడు పనులు చేసి జైలుకు రావొద్దని తెలిపింది.
