Se*xual Harassment: విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో దారుణం చోటు చేసుకుంది. భర్త కామవాంఛకు భార్య బలైంది. భర్త పోర్న్ వీడియోలకి బానిసయ్యాడని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, నాగేంద్ర, వసంతలకు 11 నెలల క్రితం పెళ్లైంది అని బంధువులు తెలిపారు. నాగేంద్రకు నరాల బలహీనత ఉండటంతో.. పెళ్లయిన నెల రోజుల తర్వాత నుంచి హిమాలయ CONFIDO టాబ్లెట్స్ వాడుతున్నాడు అని చెప్పారు. కానీ, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు నెలకు ఒక బాటిల్ కొంటున్నాడని.. అందులోని 60 టాబ్లెట్స్ ను రోజుకు రెండు చొప్పున వాడుతున్నాడే విషయం తర్వాత తెలిసిందన్నారు. మొదట్లో ప్రోటీన్, విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పుకొచ్చిన నాగేంద్ర.. భార్యకు నెలసరి రోజుల్లో కూడా భర్త వదల లేదని బంధువులు వెల్లడించారు.
Read Also: FASTag: ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ టోల్ తప్పదు!
ఇక, తీవ్ర రక్త స్రావంతో స్పృహ కోల్పోయిన భార్య వసంత.. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడంతో ఇప్పటి వరకు ఆమె గర్భం దాల్చలేదు.. పోర్న్ వీడియోలు చూసి అడిక్ట్ ఆయినా భర్త.. పోర్న్ వీడియోస్ లో ఉన్న విధంగా శృంగారం చేయాలని భార్యను తీవ్ర ఒత్తిడికి గురి చేసేవాడని బంధువులు చెప్పుకొచ్చారు. భర్త వికృతి చేష్టలకు, ఒత్తిడికి గురై నరక యాతన అనుభవించిన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపించింది.