Site icon NTV Telugu

Gudivada Amarnath: రుషికొండ బిల్డింగ్‌ల కోసం చంద్రబాబు, పవన్‌, లోకేష్ పోటీ పడుతున్నారు..!

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: కూటమి సర్కార్‌, వైసీపీ మధ్య రుషికొండపై నిర్మించిన భవనాలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. తాజాగా, రుషికొండ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.. కొన్ని చోట్ల డ్యామేజ్‌ జరిగినట్టు పేర్కొన్నారు.. ఇక, దానిని ఎలా వినియోగించుకోవాలనే ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, పవన్‌ కల్యాణ్‌ రుషికొండ పర్యటనపై సెటైర్లు వేశారు.. వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రుషి కొండ బిల్డింగ్‌లు వాడుకునేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ పోటీ పాడుతున్నారని విమర్శించారు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, షాడో సీఎం (లోకేష్‌) విశాఖ పర్యటనకు వచ్చినప్పటికీ కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడక పోగా చులకనగా మాట్లాడారని మండిపడ్డారు.. రాష్ట్రంలో సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం.. జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించడం అలవాటుగా మారిందన్నారు.. కూటమి పార్టీ నేతలకు రుషికొండ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది.. అక్కడ వాతావరణం ఆస్వాదించి, సెల్ఫీ తీసుకుని విమర్శలు చేయడం అలవాటైందని ఎద్దేవా చేశారు..

Read Also: Pre-Nursery Fees In Bengaluru: ఇదేం దోపిడి సామీ.. ప్రీ నర్సరీకి రూ. 1.85 లక్షల ఫీజు వసూల్..

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే సీఎం నివాసం కోసం టూరిజం రిసార్ట్ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు అమర్నాథ్.. ఎన్నికల్లో గెలవడం నుంచి ఇప్పటి వరకు కూటమి పార్టీలకు రుషికొండ ప్రచారాస్త్రంగా మారిందన్నారు.. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్.. జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇల్లు కడితే అది స్కీమ్ ఇల్లా…? లేక పూరిల్లా…? అని ప్రశ్నించారు. 5 వేల కోట్లు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టిన చరిత్ర టీడీపీదని సెటైర్లు వేశారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌ వెళ్లినప్పుడు POP స్లాబ్ కూలినట్టు విడుదల చేసిన ఫొటోలు ప్రచారం చేస్తున్నారు.. పడిపోవడం కాదు.. కట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.. మరోవైపు, అమరావతిలో అడుగుకి 13 వేలు ఇచ్చి కట్టించిన సెక్రటేరియట్ గతి ఎలా ఉందో అంటూ ఏవీ విడుదల చేశారు.. రుషికొండ లా.. అమరావతిలో కూడా పవన్ కల్యాణ్‌ ఫొటోషూట్ పెడితే బండారం బయటపడుతుందని పేర్కొన్నారు..

Read Also: Sugali Preethi Case: పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి కౌంటర్‌ ఎటాక్‌..

రుషికొండ మీద అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం GOలో రిసార్ట్ అని పేర్కొనం వెనుక అసలు ఉద్దేశాలు ప్రజలు గమనించాలి అని సూచించారు అమర్నాథ్.. ప్యాలెస్ అని జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయడానికి రుషికొండను వాడుకున్నారన్న ఆయన.. జగన్మోహన్ రెడ్డి ప్యాలస్ అనేది నిజమైతే ఆ విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు..? అని ప్రశ్నించారు.. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ గురించి గొంతు చించుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ప్రైవేట్‌పరం అయిపోతుంటే సూక్తులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..

Exit mobile version