NTV Telugu Site icon

Gudivada Amarnath: దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. తీవ్ర వ్యాఖ్యలు

Gudiwada Amarnath

Gudiwada Amarnath

ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే సరికి దేశ వ్యాప్తంగా ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ 11వ స్థానంలో ఉందని తెలిపారు. అయితే వైసీపీ వచ్చాక 9వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ పరిశ్రమలను తీసుకురాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా పెరిగిందని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

Read Also: Maha Kumbh Mela 2025: రికార్డ్ స్థాయిలో భక్తులు.. 10 కోట్ల మంది స్నానాలు

దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని అన్నారు. లోకేష్ భజనతో దావోస్ ముగిసింది.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బ తీశారు.. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్ అని దుయ్యబట్టారు. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారని విమర్శించారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారని తెలిపారు.

Read Also: Wife For Rent: అద్దెకు భార్యలు? ఎక్కడో కాదు మన దేశంలోనే.. ధర ఎంతంటే?

పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు.. బల్క్ డ్రగ్ పార్క్ వైసీపీ హయాంలో వచ్చిందని తెలిపారు. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది.. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు.. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడని విమర్శించారు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావోస్ వెళ్లారు.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.