Gudivada Amarnath: దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. తీవ్ర వ్యాఖ్యలు
- సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు
- గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని..,
- కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుంది- గుడివాడ అమర్నాథ్
- దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారు
- పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు
- రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదు- గుడివాడ అమర్నాథ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే సరికి దేశ వ్యాప్తంగా ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ 11వ స్థానంలో ఉందని తెలిపారు. అయితే వైసీపీ వచ్చాక 9వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ పరిశ్రమలను తీసుకురాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా పెరిగిందని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
Read Also: Maha Kumbh Mela 2025: రికార్డ్ స్థాయిలో భక్తులు.. 10 కోట్ల మంది స్నానాలు
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని అన్నారు. లోకేష్ భజనతో దావోస్ ముగిసింది.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బ తీశారు.. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్ అని దుయ్యబట్టారు. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారని విమర్శించారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారని తెలిపారు.
Read Also: Wife For Rent: అద్దెకు భార్యలు? ఎక్కడో కాదు మన దేశంలోనే.. ధర ఎంతంటే?
పెట్టుబడిదారులను వేధింపులకు గురిచేశారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు.. బల్క్ డ్రగ్ పార్క్ వైసీపీ హయాంలో వచ్చిందని తెలిపారు. ప్రధాని శంకుస్థాపన చేసిన హైడ్రోజన్ గ్రీన్ హబ్ వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చింది.. ఒక హామీ ఒక స్కీం కూడా అమలు చేయలేదు.. నమ్మే వాళ్ళు ఉంటే బిల్ గేట్స్ చంద్రబాబు కలిసి చదువుకున్నాము అంటాడని విమర్శించారు. చంద్రబాబు బ్రాండ్ ఇమెజ్ పెంచుకోవడానికి దావోస్ వెళ్లారు.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
-
CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!