CM Chandrababu: విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ( డిసెంబర్ 12న) సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించబోతున్నారు. అక్కడ మధురవాడ, రుషికొండ ఐటీ జోన్ ప్రాంతాల్లో 9 ఐటీ కంపెనీలకు, వాటి సంబంధిత యూనిట్లకు ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఏపీఐఐసీ ద్వారా కేటాయించిన 69.97 ఎకరాల భూముల్లో ఈ ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయనున్నారు.
Read Also: Akhanda2 : అఖండ – 2 బాలయ్య కెరీర్లోనే బిగ్గేస్ట్ ఓపెనింగ్
అయితే, మధురవాడ, రుషికొండలో భూమి ధర ఎకరానికి కనీసం గరిష్ఠంగా రూ.4 కోట్ల వరకు పలకనుంది. తాజా పరిణామంతో యువతకు సుమారు 41,967 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. సీఎం చంద్రబాబు ప్రారంభించే ఐటీ కంపెనీల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ, సామ్వర్థన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇమాజినోవేట్ టెక్‌సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లూయెంట్‌గ్రిడ్ లిమిటెడ్, శ్రీ టెక్ తమ్మినా, నాన్‌రెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏసీఎన్ హెల్త్‌కేర్ RCM సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖపట్నం రాకతో, త్వరలోనే గ్లోబల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
