Site icon NTV Telugu

Vizag Metro: విశాఖ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై కీలక ముందడుగు..

Metro Rail

Metro Rail

Vizag Metro: ఓవైపు రాజధాని అమరావతి అభివృద్ధిపై ఫోకస్‌ పెడుతూనే.. ఇంకా వైపు విశాఖపట్నం డెవలప్‌మెంట్‌పై దృష్టిసారిస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇక, ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్న.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూ కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ సమావేశానికి మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.. నేరుగా సమావేశానికి 14 సంస్థల ప్రతినిధులు హాజరుకాగా.. ఆన్‌లైన్‌ ద్వారాలో 8 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.. ఇక, జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి.. కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది APMRCL.. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ ప్రక్రియ ఊపందుకుంది..

Read Also: Health Tips: తేనె ఆరోగ్యానికి, అందానికి వరం.. ప్రతి రోజు స్పూన్ చాలు

కాగా, నాలుగేళ్లలో విశాఖ మెట్రో రైల్‌ పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించిన విషయం విదితమే.. తొలి దశలో మూడు కారిడార్లు.. 46.23 కిలోమీటర్ల ట్రాక్‌.. రెండో దశలో కొమ్మాది-భోగాపురం విమానాశ్రయం కారిడార్‌ పూర్తి చేయనన్నారు.. మొదటి దశ నిర్మాణానికి రూ.11,498 కోట్లు అవసరం కాగా.. 100 శాతం గ్రాంటు కేంద్రాన్ని కోరనున్నట్టు సీఎం తెలిపారు.. విశాఖలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉన్నందున.. రెండింటికీ పరిష్కారం లభించేలా డబుల్‌ డెక్కర్‌ మోడల్‌లో మెట్రో ట్రాక్‌ల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు సూచించిన విషయం విదితమే..

Exit mobile version