NTV Telugu Site icon

Hayagriva Land: ‘హయగ్రీవ’ భూములపై సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం..

Hayagriva Land

Hayagriva Land

Hayagriva Land: ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ, హయగ్రీవ సంస్థకు ఝలక్ తగిలింది. విశాఖపట్నం జిల్లా ఎండాడగ్రామం సర్వే నంబర్ 92/3 లో 12.50 ఎకరాల కొండ పోరంబోకు స్థలాన్ని 2008 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయగ్రీవ ఫార్మ్ అండ్‌ విల్లాస్ సంస్థకు కేటాయించింది. చిలుకూరి జగదేశ్వరుడికి చెందిన ఈ సంస్థకు 2008 డిసెంబర్ ఆరవ తేదీన అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం శాతం స్థలంలో అనాదాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు, మిగతా 90 శాతంలో  వయోవృద్ధులకు మాత్రమే గృహ నిర్మాణాలు చేసి విక్రయించే నిబంధనలతో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయింపులు జరిగాయి.

Read Also: Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై అమృత సంచలన పోస్ట్..

అయితే, సకాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో హయగ్రీవ సంస్థ విఫలం కావడంతో రెవిన్యూ అధికారులు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని 2018లో  వెనక్కు తీసుకున్నారు. దీనిపై హయగ్రీవ సంస్థ కోర్టులో సవాల్ చేయగా మూడేళ్లలో ప్రభుత్వం కేటాయించిన ప్రతిపాదిత ప్రాజెక్టు అనగా 10 శాతంలో అనాధ, వృద్దాశ్రమాన్ని మూడేళ్ల నిర్మాణం చేసి 90శాతంలో వయోవృద్ధులకు గృహ నిర్మాణా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ భూమితో హయగ్రీవ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. లోప భూయిష్టమైన ఒప్పందాలను అడ్డుగా పెట్టుకుని భూముల్ని అమ్మడం ప్రారంభించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే 16 సేల్ అగ్రిమెంట్లు, 15 సేల్ డీడ్లు చేశారని గుర్తించి 2022 మే, జూలైలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ., ఆడిటర్.. వైసీపీ నేత గన్నమని వెంకటేశ్వరరావు ఎంట్రీతో ఈ లావాదేవీలు వేగవంతం అయ్యాయి. ఆశ్రమం నిర్మాణం చేస్తూనే విల్లాలను అమ్ముకుని వేలకోట్లు కొట్టేశారనేది ప్రధాన అభ్యంతరం.

Read Also: PM Modi: నేటి నుంచి రెండ్రోజులు మారిషస్‌‌లో మోడీ పర్యటన

ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, జీవీలు కలిసి తమ సంతకాలను ఫోర్జరీ చేయటంతో పాటు కొన్ని ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకుని, వాటి ఆధారంగా ప్రభుత్వం నుంచి తాను పొందిన భూమిని కబ్జాచేసి వారి ఆధీనంలోకి తీసుకున్నారని హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ భాగస్వామిగా ఉన్న చిలుకూరి జగదీష్ ఆరిలోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కబ్జాపై గట్టిగా ప్రశ్నించినందుకు తనపై బెదిరింపులకు దిగారని  ఫిర్యాదులో పేర్కొన్న జగదీశ్ బలవంతంగా తనను తన భార్య రాధా రాణిని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ ఆధారంగా బ్రహ్మాజీ, జీవీ, ఎంవీవీ సత్య నారాయణ లపై 10 సెక్షన్ల కింద అరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ MVV ఇంట్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసింది.