విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ప్రమాదం తప్పింది. జోరు వానలకు తడిచి గోడలు కూలిపోతున్నాయి. మరోవైపు.. కంచరపాలెంలో రైల్వే గోడ కూలిన ఘటన చోటు చేసుకుంది. దీంతో.. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గవర కంచరపాలెంలో ఇళ్లకు ఆనుకొని రైల్వే గోడ ఉండటంతో.. అది కూలి కార్లు, బైక్ లు, కరెంట్ పోల్స్ ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే.. కూలిన రైల్వే గోడ పక్కన వినాయక మండపం ఉంది. గోడ కూలిన సమయంలో వినాయక మండపంలో చిన్నారులు ఉన్నారు. అయితే.. మండపంలో ఉన్న చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మిగిలిన రైల్వే గోడ ఎక్కడ కూలి విద్యుత్ స్తంభాలు, ఇంటిమీద పడిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Ap Floods : 3 రోజుల్లో 60 వేల మందికి రేషన్ పంపిణీ.. 42 డ్రోన్ల సహాయంతో లక్ష మందికి పైగా ఫుడ్
మరోవైపు.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా.. విశాఖ, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కాకినాడ, యానంలకు భారీ వర్షంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఫ్లాష్ ఫ్లాట్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తీవ్రవాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కి.మీ గరిష్టంగా 70 కిలోమీటర్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రి పూరి- దిఘా మధ్య తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Jackal attack: యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు.. దాడిలో 12 మంది గాయాలు..