CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CBI Arrest: ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన కంటైనర్ల క్లియరెన్స్ కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ (పీక్యూఎస్) అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అందిన వివరాల ప్రకారం… విశాఖపట్నంలోని ప్లాంట్ క్వారంటైన్ స్టేషన్ కేంద్రంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారంలో సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సహా ఇద్దరు అధికారులు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై నవంబర్ 6, 2026న సీబీఐ కేసు నమోదు చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కంటైనర్లకు అవసరమైన క్లియరెన్స్ పత్రాలు మంజూరు చేసేందుకు నిందితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ రూ.1,00,000 లంచం డిమాండ్ చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నవంబర్ 6న వ్యూహాత్మకంగా వలపన్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి సదరు అధికారి రూ.లక్ష లంచం నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును రికవరీ చేసిన అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు లంచం ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన విశాఖపట్నం, ఫరీదాబాద్, అలాగే కర్ణాటకలోని కోలార్ జిల్లా తిమ్మనపల్లి గ్రామాల్లోని నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ బృందాలు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. పట్టుబడిన ఇద్దరు నిందితులను శనివారం విశాఖపట్నంలోని సంబంధిత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
Also Read
- YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
- AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
తాజావార్తలు
-
CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
-
Cheyutha Pensions: గుడ్‌న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
-
Tesla Cybertruck: “మూడేళ్లకే కథ ముగిసింది”.. టెస్లా ‘సైబర్ ట్రక్’ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
-
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!