NTV Telugu Site icon

Yarlagadda Venkata Rao: పేద ప్రజలందరి సొంతింటి కలను నిజం చేస్తాం..

Yarlagadda

Yarlagadda

విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలో స్ధానిక నాయకులతో కలిసి గన్నవరం నియోజకవర్గం జనసేన, బీజేపీ బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీగా ఎదురేగి ఘనస్వాగతం పలికారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం చేయడమే తెలుగుదేశం పార్టీ విధానమని, అధికారంలోకి రాగానే హౌసింగ్ ఫర్ ఆల్ అనే విధానంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని 15 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను అందజేస్తామని ఇప్పటికే ఎన్నికల మేనిఫేస్టోలో ప్రకటించామని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించి యవత సర్వతోముఖాభివృద్ధికి నిర్విరామంగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీయే కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు పేద, మధ్యతరగతి ప్రజల ఆశయాలకు ఆసరాగా, ఆర్థిక భరోసాగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.

Sunil Narine: సునీల్ నరైన్‌ ఎందుకు నవ్వడు.. కోల్‌కతా ప్లేయర్స్ ఏం చెప్పారంటే?

గన్నవరం భవిష్యత్తుకు ఆరు హామీలతో ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేశామని, బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్ గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. నూతన వంతెనల నిర్మాణం ఏలూరు కాలువపై రామవరప్పాడు దగ్గర కొత్త వంతెన నిర్మాణం, ఎనికేపాడు రహదారిలో వంతెన ఏర్పాటు చేసి రహదారి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన 15 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని, మల్లవల్లి పారిశ్రామికవాడకు పూర్వవైభవం కల్పించి అశోక్ లేలాండ్ కంపెనీ పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేసే విధంగా పారిశ్రామికవాడలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తామని.. తద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది యువతకు ఉపాధి, పరోక్షంగా మరో 5 వేల మందికి మేలు జరుగుతుందని ప్రజలకు తెలిపారు. అలాగే గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో బహుళజాతి కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేసి తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పోలవరం కుడి కాలువ పనులు సత్వరమే పూర్తి చేస్తామని బండారుగూడెం వద్ద 137వ కి.మీ నుంచి ఏలూరు కాలువ 33వ కి.మీ వద్ద అనుసంధానం చేసి తద్వారా డెల్టా రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Russia Ukraine War: సైన్యానికి పుతిన్‌ తాజా ఆదేశాలు ఇవే..!

ఎన్డీయే కూటమి అధికారం చేపట్టగానే ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి అమలు చేసి తద్వారా భవన నిర్మాణ రంగ కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలపై భారం మోపుతూ, కార్మిక హక్కులను హరిస్తున్న వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన భాద్యత ఆయా వర్గాలపై ఉందని అన్నారు. టీడీనీ, జనసేన కూటమి ప్రకటించిన మ్యానిఫెస్టో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అగ్ర స్ధానంలో నిలిపే దిశగా ఉందని దీనిని అమలు చేసే శక్తి, సామర్ధ్యాలు కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. పేద ప్రజలకు సేవచేస్తూ.. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రపథాన నిలపాలని దృఢమైన సంకల్పంతో ఉన్నానని.. ప్రజలందరూ మొదటి ఓటును గాజుగ్లాసు గుర్తుకు వేసి మచిలీపట్నం పార్లమెంటు కూటమి అభ్యర్ధియైన వల్లభనేని బాలశౌరికి, రెండవ ఓటు సైకిల్ గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.