Sunil Narine: సునీల్ నరైన్ ఎందుకు నవ్వడు.. కోల్‌కతా ప్లేయర్స్ ఏం చెప్పారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR Players on Sunil Narine Smile: మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చాలా సీరియస్‌గా ఉంటాడు. ఎప్పుడూ కామ్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారీగా రన్స్ ఇచ్చుకున్నా లేదా వికెట్ పడినా ఒకేలా ఉంటాడు. ఎక్కువగా సంబరాలు చేసుకోడు. ముఖంలో ఎలాంటి భావోద్వేగాలూ కనిపించనీయకపోవడంతో ప్రత్యర్థులు కూడా గందరగోళానికి గురవుతుంటారు. దాంతో నరైన్ ఎందుకు నవ్వడు అని చాలా మంది మెదడును తొలుస్తుంటుంది. ఈ ప్రశ్నకు కోల్‌కతా ప్లేయర్స్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
సునీల్ నరైన్ భావోద్వేగాలను కనిపించనీయకపోవడానికి అతడి అనుభవమే కారణమని ఆండ్రీ రస్సెల్ అన్నాడు. ‘నరైన్ 500 మ్యాచ్‌లు ఆడాడు. ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కారణంగా తొందరగా మీలో ఉద్రేకం కనిపించదు’ అని రస్సెల్ తెలిపాడు. ఫిల్ సాల్ట్ మాట్లాడుతూ… ‘నరైన్ చాలా స్థిరమైన మనిషి. మైదానం బయట చాలా సరదాగా ఉంటాడు. క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తాడు. ఇద్దరు ఆటగాళ్లను కలిపితే అతడితో సమానం’ అని పేర్కొన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Sachin Tendulkar: రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.. సచిన్ పొరుగింటి వ్యక్తి ఫిర్యాదు!
రఘువంశీ మాట్లాడుతూ… ‘నరైన్ డగౌట్లో బాగా నవ్వుతాడు. అందరిపై జోకులు వేస్తాడు. సీరియస్‌గా ఉండటం ఆట వరకే అనుకుంటాను. అతడు లెజెండ్. బ్యాట్, బాల్‌తో అద్భుతాలు సృష్టించగలడు’ అని తెలిపాడు. బంతితో సంచలనాలు సృష్టించే నరైన్.. ఐపీఎల్ 2024లో పూర్తిస్థాయి బ్యాటర్‌గా మారాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి. 183.67 స్ట్రైక్‌రేట్‌తో 461 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాడు. నరైన్ ఆటతో కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమైంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!