Kanaka Durga Temple: దుర్గమ్మ భక్తులకు అలర్ట్… ఇంద్రకీలాద్రిపై కీలక మార్పులు..
- బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు అలర్ట్..
- ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పలు కీలక సంస్కరణలను అమలు చేశారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయం ఆదా, పారదర్శకత, దుర్వినియోగ నియంత్రణ లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. ఇకపై రూ.500 అంతరాలయ దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డును.. దర్శనానికి వెళ్లే ముందు, టికెట్ స్కానింగ్ పాయింట్ వద్దే పంపిణీ చేయనున్నారు. అంటే, దర్శనం పూర్తయ్యాక ప్రసాదం కోసం వేరే కౌంటర్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తుడికి లడ్డు చేతికి అందజేసే విధానంను ఆలయ బోర్డు అమల్లోకి తీసుకొచ్చింది.
Read Also: China vs Battle of Galwan: ‘బ్యాటల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాపై చైనా మీడియా అక్కసు..
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
ఈ నిర్ణయం ద్వారా ప్రసాద పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే, దర్శన టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆలయ ఆదాయ నిర్వహణలో జవాబుదారీతనం పెంచడం కూడా ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. భక్తుల రద్దీ నియంత్రణలో భాగంగా.. ఆలయంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. టికెట్ స్కానింగ్, ప్రసాదం తక్షణ పంపిణీ వంటి విధానాల ద్వారా.. క్రౌడ్ మేనేజ్మెంట్ మరింత కట్టుదిట్టంగా మారుతుందని వెల్లడించారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదం తప్పకుండా అందేలా పర్యవేక్షణను పెంచుతామని, ప్రసాద పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, దర్శన వ్యవస్థను భక్తులకు మరింత ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
ఇక, కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ మార్పులు.. భక్తులకు సులభమైన, వేగవంతమైన దర్శనం, ప్రసాదం ఇంద్రకీలాద్రి ప్రవేశద్వారంలోనే అందేలా చేయడంతో పాటు.. పూర్తి పారదర్శకతతో కూడిన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ సూచనలను తప్పకుండా పాటించాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!