Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- అమ్మవారి భక్తులకు సువర్ణావకాశం
- ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈవో పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ఆలయ అధికారులు ఉచిత యోగ శిక్షణ ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు వెల్లడించారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి 14 రోజుల పాటు భక్తులకు.. ఆలయ ఉద్యోగులకు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉచిత యోగ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపటి నుండి (జూన్ 07 నుంచి జూన్ 21 వరకు) 14 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
ప్రతి రోజు ఉదయం 7:00 గంటల నుంచి 8:00 గంటల వరకు ఇంద్రకీలాద్రిపైనున్న మహా మండపం 6వ అంతస్తులో ఈ యోగా శిక్షణ జరుగుతుందని.. నిపుణులచే యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే భక్తులకు ఉచితంగా ప్రసాదం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ యోగా శిక్షణకు విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. కార్యక్రమంలో పాల్గొనే భక్తుల వివరాలను నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. ప్రతీ రోజు యోగా సాధన అనంతరం భక్తులందరికీ దేవస్థానం తరపున ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!