AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ మూడో అదనపు ఛార్జిషీటును ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. జూన్ 19న ప్రైమరీ ఛార్జిషీట్ ను మొదటగా సిట్ దాఖలు చేసింది. ఇందులో కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్రల గురించి వివరించింది. ఆగస్టు 11వ తేదీన రెండో అదనపు ఛార్జిషీట్‌ను అధికారులు దాఖలు చేశారు. ఇందులో కేసులో ఏ31గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పల పాత్ర గురించి సిట్ పేర్కొంది. కేసులో మొత్తం 48ని ఇప్పటి వరకు నిందితులుగా చేర్చగా అందులో 29 మంది వ్యక్తులు, 19 సంస్థలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేసులో 12 మందిని సిట్ అరెస్టు చేయగా అందులో నలుగురిని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో ఏ30గా ఉన్న పైలా దిలీప్ కు రెగ్యులర్ బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. 90 రోజులు జ్యుడీషియల్ కస్టడీ పూర్తి చేసుకున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు డిఫాల్డ్ బెయిల్ ను మంజూరు చేసింది.
Read Also: Tollywood : ఈ ఏడాది రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలివే!
ఇప్పుడు 90 రోజుల జ్యూడీషియల్ కస్టడీని చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సిట్ తాజాగా మూడో అదనపు ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండటానికి సిట్ అధికారులు ఈ మూడో అదనపు ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. 11 వాల్యూమ్స్ తో 86కి పైగా పేజీలతో మూడో అదనపు చార్జిషీట్ ను సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దీని తర్వాత నాలుగో అదనపు ఛార్జిషీట్ లేదా తుది ఛార్జిషీట్ ను అధికారులు దాఖలు చేయనున్నారు. కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ38గా ఉండగా.. వెంకటేష్ నాయుడు ఏ34గా ఉన్నారు. బాలాజీ కుమార్ యాదవ్ ఏ35గా, నవీన్ కృష్ణ ఏ36గా ఉన్నారు. ఈ ముగ్గురు చెవిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉండి.. లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారనేది సిట్ గుర్తించింది. చార్జి షీట్ అసంపూర్తిగా ఉందని ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయటంతో సిట్ అధికారులు ఈసారి అప్రమత్తమయ్యారు. ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించి ఛార్జ్ షీటును దాఖలు చేశారు.
Read Also: Fee Reimbursement: చర్చలు సఫలం.. నిధులకు పచ్చజెండా.. ప్రైవేట్ కళాశాలల బంద్ విరమణ
లీక్కర్ స్కాం లో వచ్చిన ముడుపుల సొమ్ములో కొంత భాగాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులకు చేరవేయటంతో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఛార్జిషీట్ లో సిట్ పేర్కొన్నట్లు సమాచారం. ముడుపుల సొమ్ము తరలింపు. కలెక్షన్ పాయింట్ లకు చేరవేయటంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని సమాచారం. వెంకటేశ్ నాయుడు కోట్ల రూపాయల డబ్బును లెక్క పెడుతున్న వీడియోలను ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హవాలా మార్గంలో డబ్బులను వెంకటేష్ నాయుడు తెచ్చాడని సిట్ చెబుతోంది. వెంకటేష్ నాయుడుకి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు సహకరించారని సిట్.. ఛార్జిషీట్ లో పేర్కొన్నట్టు సమాచారం. తుడాకు చెందిన వాహనాలను కూడా నిందితులు డబ్బు తరలింపుకు వినియోగించినట్టు సిట్ గుర్తించింది. దీంతోపాటు డబ్బును ఎవరెవరికి చేర్చారో కూడా పొందుపరిచారు. దీంతోపాటు నిందితులు సీడీఆర్ లు, మొబైల్ ఎఫ్ ఎస్ఎల్ రిపోర్టులు, సెల్ ఫోన్ టవర్ లోకేషన్లు, టవర్ డంప్ లు, టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రాకపోకల వివరాలు కూడా ఛార్జిషీట్ లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది..