Kesineni Nani vs Kesineni Chinni: ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు.. సీఎంకు కేశినేని నాని లేఖ
- కేశినేని నాని వర్సెస్ కేశినేని చిన్ని..
- ఏపీ లిక్కర్ కేసులో తమ్ముడిపై ఆరోపణలు..
- సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ..
- ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేసిన కేశినేని నాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Nani vs Kesineni Chinni: విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని..
Raed Also: India-Pakistan Tensions: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. సమస్య పరిష్కారం కోసం భద్రతా మండలి కీలక భేటీ..
Also Read
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తులతో, ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని సన్నిహిత సహాయకుడు దిలీప్ పైలాతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి సంబంధం ఉన్న తీవ్రమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్న కేశినేని నాని.. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు మరియు ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మరియు అతని భార్య జానకీ లక్ష్మీ కేసినేనితో కలిసి Pryde Infracon LLPలో నియమిత భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, ప్లాట్ నెం. 9, సర్వే నెం. 403లో నమోదు అయ్యిందని పేర్కొన్నారు.. కేసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న Eshanvi Infra Projects Pvt. Ltd. కూడా ఇదే చిరునామాను కలిగి ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, Pryde Infracon LLP మరియు Eshanvi Infra Projects Pvt. Ltd. రెండూ ఒకే అధికారిక ఈమెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నాయి అని దుయ్యబట్టారు.. ఇది రెండు సంస్థల మధ్య సామీప్యత మాత్రమే కాకుండా, ఉద్దేశపూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తుందన్నారు..
Read Also: Fire Accident : ప్యాట్నీ సెంటర్ SBI బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం.. కీలక ఫైల్స్ దగ్ధం
ఇప్పటికే ఇద్దరు కీలక వ్యక్తుల అరెస్ట్‌తో దర్యాప్తులో ఉండవచ్చని, ఒక సిట్టింగ్ ఎంపీతో నేరుగా సంబంధం ఉండటం రాజకీయ రక్షణ మరియు ఆర్థిక సమన్వయం గురించి తీవ్రమైన ఆందోళ కలిగిస్తోందన్నారు కేశినేని నాని.. ఇక, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు విదేశీ కంపెనీలలో అక్రమంగా మళ్లించిన పెద్ద మొత్తంలో నిధులను పెట్టుబడి పెట్టారని నమ్మదగిన సమాచారం సూచిస్తోంది. ఇవి కుంభకోణంతో సంబంధం ఉన్న దేశీయ కార్యకలాపాల నుండి లెక్కలేని సంపదను లాండరింగ్ చేయడానికి మరియు నిల్వ చేయడానికి ఉపయోగించబడవచ్చు అనే అనుమానాలను లేవనెత్తారు.. మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని.. ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశించాలని సీఎం చంద్రబాను కోరారు.. ఈ స్థాయిలో అధికార దుర్వినియోగం, నిందితులతో సామీప్యతను పరిశీలించకుండా వదిలివేయకూడదు. మీరు నిర్ణయాత్మకంగా చర్య తీసుకోవాలని, న్యాయాన్ని నిలబెట్టాలని.. రాజకీయ సంబంధాలు జవాబుదారీతనానికి అడ్డంకిగా నిలవకుండా చూడాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు మాజీ ఎంపీ కేశినేని నాని..
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!