AP BJP New President: ఆంధ్రప్రదేశ్‌లో కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడిందనే చెప్పాలి.. నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు మాధవ్..
Read Also: MLA Raja Singh: టీడీపీ నుంచి బీజేపీకి.. రాజా సింగ్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి..
ఇక, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను రేపు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు.. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కర్ణాటకకు చెందిన ఎంపీ మోహన్‌ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం.. అయితే, ఈ రోజు మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడవు ముగిసింది.. పీవీఎన్ మాధవ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.. ఒకే నామినేషన్ వేయడంతో దాదాపు ఏపీ బీజేపీ చీఫ్ పేరు ఖరారైనట్టే.. దీనిపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఎన్ మాధవ్ దాఖలు చేసారు.. పీసీ మోహన్, పాకా సత్యనారాయణ ఎన్నికలు నిర్వహించారు.. రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు.. ఇవాళ నామినేషన్లు స్క్రూటినీ జరుగుతుంది.. రేపు అధ్యక్షుని ప్రకటన జరుగుతుందన్నారు సోము వీర్రాజు..
Read Also: Control Room: ప్రమాద బాధితుల సహాయ చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
ఇక, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. పీవీఎన్ మాధవ్ కు అనుకూలంగా ఐదు సెట్లు నామినేషన్ వేసారు.. ఒకే నామినేషన్ వేసారు గనుక ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.. టెక్నికల్ గా రేపు పీవీఎన్ మాధవ్ అధ్యక్షుడుగా ప్రకటించబడతారు అని తెలిపారు.. మాధవ్ తండ్రి చలపతిరావు కూడా ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేసారు.. ఉత్తరాంధ్ర వ్యక్తి మాధవ్.. ఆయన తల్లి మాధవ్‌ను చంకలో పెట్టుకుని ఎమర్జెన్సీలో జైలుకెళ్లారని గుర్తుచేశారు.. బీజేపీ బీసీలకు పెద్దపీట వేసినట్టు భావించచ్చు.. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ కు మా సహకారం ఉంటుంది.. కూటమిలో ఉంటూనే పటిష్టం కావడానికి పని చేయాల్సిన బాధ్యత అధ్యక్షుడిపై ఉంటుందన్నారు విష్ణుకుమార్ రాజు..
Read Also: All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!
కాగా, పీవీఎన్ మాధవ్‌కు బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఎమ్మెల్సీగా.. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన కుటుంబం కూడా పార్టీ కుటుంబంగానే చెప్పుకోవాలి.. మరోవైపు.. రేపు ఉదయం 9 గంటలకు బెజవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకోబుతున్నారు ఏపీ బీజేపీ కాబోయే నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.. అమ్మవారి దర్శనం అనంతరం స్ధానిక కన్వెన్షన్ లో జరిగే పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు..
