బీజేపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తాను అని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్ మాధవ్ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈరోజు స్వీకరించారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాధవ్‌కు అప్పగించారు.…
నామినేషన్ల దాఖలు ఇవాళ్టితో ముగిసినా.. రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నా.. పార్టీ రాష్ట్ర కొత్త సారథిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ పేరునే పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయం అనేది స్పష్టం అయ్యింది.. రాష్ట్ర అధ్యక్ష పదవికి పీవీఎన్ మాధవ్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ వేశారు.. మొత్తం ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు…
కేంద్ర బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించింది. ఈ విషయమై జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు ఫోన్ చేశారు. 'మీ పదవీకాలం ముగిసింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీరు రాజీనామా చేయండి' అని నడ్డా తనకు సూచించినట్లు వీర్రాజు స్వయంగా తెలిపారు.