Hijras Harassment: విజయవాడలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలను తట్టుకోలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఈ సందర్భంగా హిజ్రాల దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నగరంలో పలువురు ఆందోళనకు దిగారు. ఈ నెల 13వ తేదీన హిజ్రాల వేధింపులను తట్టుకోలేక సత్య కుమారి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం సోమవారం నాడు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. దీంతో గిరిపురం సెంటర్ దగ్గర మృతదేహంతో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు.
Read Also: KTR: రాష్ట్రంలో ఎన్నికల ముందు హామీల జాతర ఉండేది.. ఇప్పుడు యూరియా కోసం చెప్పుల జాతర కనిపిస్తుంది..
విజయవాడలో హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నడి రోడ్డుపై బైఠాయించారు. ఇక, సమాచారం తెలుసుకున్న మాచవరం పోలీసులు, అక్కడికి చేరుకొని మృతురాలి బంధువులతో చర్చలు జరిపారు. ఆందోళన చేయకండి.. వారిపై తగిన చర్యలు తాము తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న హిజ్రాలే టార్గెట్ గా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.