Paturi Nagabhushanam: గతంలో పవన్ కల్యాణ్‌ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.. ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించ లేదు.. విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? డాక్టర్ సుధాకర్ న్యాయం అడిగితే బట్టలు ఊడదీసి కొట్టి అతని మరణానికి కారణమయ్యారు..! చంద్రబాబు, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్రను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టలేదా..? పవన్ ను ఎపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also: Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్
మా అధ్యక్షురాలు పురంధేశ్వరి మద్యం వల్ల మరణాలు అని చూపిస్తే.. ఆమెపై అసభ్య పోస్టులు పెట్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగభూషణం.. మా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పైనా వ్యంగ్య పోస్టులా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు మంచితనం వల్ల చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నారు.. సిసోడియాను వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు .. లోకేష్ రెడ్ బుక్ పూర్తిగా తీయాలి.. చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నాను అన్నారు. రవీంద్రరెడ్డి తప్పించుకున్నాడంటే పోలీసులు సహకారం లేదా? అని నిలదీశారు..
Read Also: CJI DY Chandrachud: సీజేఐగా లాస్ట్ వర్కింగ్ డే.. అలీగఢ్ యూనివర్సిటీపై కీలక తీర్పు..
ఇక, అమరావతిలో మీరు పెంచిన తుమ్మచెట్లు పీకడానికి నలభై కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు నాగభూషణం.. పవన్ కళ్యాణ్ రాగానే పంచాయతీల అభివృద్దికి నిధులు ఇచ్చారని గుర్తుచేశారు.. నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి, పారదర్శకంగా పని చేస్తున్నారని ప్రశంసించారు.. చంద్రబాబు అనుభవంతో నేడు వేల కోట్లు నిధులు ఏపీకి తీసుకు వస్తున్నారని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షా 20వేల కోట్లతో ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు ఏపీ బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం..