NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Case: వంశీ కేసులో పొన్నవోలు కీలక వ్యాఖ్యలు..

Ponnavolu

Ponnavolu

Vallabhaneni Vamsi Case: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కోర్టులో కీలక వాదనలు జరిగాయి.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని.. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్య వర్ధన్.. ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతారు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.. ఇక, ఈ కేసు విచారణ తర్వాత వంశీ కేసులో వాదనలు వినిపించిన మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: MP Chamala Kiran: కేసీఆర్ ఉప ఎన్నిక వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫస్ట్ రియాక్షన్..

వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించాం అన్నారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్న ఆయన.. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు.. సీన్ రీ కనస్ట్రక్ట్ కోసం సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి.. వంశీ అవసరం లేదన్నారు.. ఇక, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు పొన్నవోలు.. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన అని పేర్కొన్నారు.. కేసుతో నాకు ఏ సంబంధమూ లేదు అని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారని వెల్లడించారు.. కారుకి నాకు సంబంధం లేదని అఫిడవిట్ లో వంశీ తెలిపారు.. ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉందని పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకొంటూ సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ఇస్తే.. అతనిపై కూడా ఈ నెల 11న కేసు నమోదు చేశారని తెలిపారు మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి.