Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Police Formed Special Teams For Vallabhaneni Vamsi Mohan Arrest

Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..

Published Date :August 2, 2024 , 11:44 am
By Sudhakar Ravula
  • మాజీ ఎమ్మెల్యే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..
  • ఏ క్షణంలోనైనా వల్లభనేనిని అరెస్ట్‌ చేసే అవకాశం..
  • వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు..
  • గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వంశీ..
Vallabhaneni Vamsi Mohan: రంగంలోకి ప్రత్యేక బృందాలు.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీ అరెస్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vallabhaneni Vamsi Mohan: మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, వంశీ హైదరాబాద్‌ వెళ్లిపోయారట.. గత నెలలోనే వంశీ హైదరాబాద్‌కు వెళ్లినట్టుగా చెబుతున్నారు.. తాజాగా వంశీని పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు..

Read Also: Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా పెరిగిన వరద ఉధృతి.. 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత..

కాగా, టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన వల్లభనేని వంశీ.. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. అయితే 2019 ఎన్నికల్లో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫైర్‌ బ్రాండ్‌ స్వరం క్రమంగా మారుతూ వచ్చింది.. వైసీపీ మద్దతుదారుగా మారిపోయిన ఆయన.. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. టీడీపీపై.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగ విమర్శలు చేయడం పెద్ద రచ్చగా మారిన విషయం విదితమే.. మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఏ క్షణంలోనైనా వల్లభనేని వంశీని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • gannavaram
  • police
  • Police Special Teams
  • tdp

తాజావార్తలు

  • Congress vs TMC: బెంగాల్‌లో మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ వ్యూహం..

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • Dragon : ఎన్టీఆర్ కారణంగా నిలిచిన షూట్?

  • Ananya Birla-RCB: అన్ని కోట్లు ఉన్నా ఆ సింప్లిసిటీ ఏందయ్యా.. ఆర్‌సీబీ ఓనర్ అనన్య అదుర్స్!

  • Stock Market: ట్రంప్ బెదిరింపుల వేళ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions