Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pawan Bought Important Books At The Book Festival How Much Were The Bills

Pawan Kalyan: బుక్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన పుస్తకాలు కొన్న పవన్.. బిల్లు ఎంతయిదంటే..?

Published Date :January 11, 2025 , 5:52 pm
By Rajesh Veeramalla
  • విజయవాడ పుస్తక మహోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్
  • 2 గంటల పాటు పవన్ కల్యాణ్‌ కోసం ప్రత్యేకంగా స్టాళ్ల ఓపెన్
  • భారీ స్థాయిలో పుస్తకాలు కొనుగోలు చేసిన డిప్యూటీ సీఎం.
Pawan Kalyan: బుక్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన పుస్తకాలు కొన్న పవన్.. బిల్లు ఎంతయిదంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన బుక్ ఫెస్టివల్ ను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది. పుస్తక మహోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్నారు. అయితే.. ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. తన కోసం ప్రత్యేకంగా ఉదయం పూట రెండు గంటలు స్టాల్స్ ఓపెన్ చేయాలని పవన్ విజ్ఞప్తి చేయడంతో నిర్వాహకులు అంగీకరించారు. కల్యాణి పబ్లికేషన్స్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సహా మరికొన్ని స్టాళ్లను పవన్ సందర్శించారు.. అనంతరం.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథంతో పాటు చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు. రూ.10 ల‌క్షలు విలువ చేసే పుస్తకాల‌ను ఆయ‌న కొనుగోలు చేయ‌డం విశేషం. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యువత కోసం ఓ మంచి లైబ్రరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందు కోసమే ఇన్ని డబ్బులు వెచ్చించి మరీ భారీగా పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: MG Windsor EV: దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత..

తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఈ పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదనపడతానని.. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే..

Read Also: Venkatesh: అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశా: వెంకటేష్ ఇంటర్వ్యూ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bills
  • book festival
  • Book stalls
  • important books
  • pawan kalyan

తాజావార్తలు

  • Avakaya Pulihora Recipe: పుల్లపుల్లగా.. కారంకారంగా.. అదిరిపోయే రుచితో ‘ఆవకాయ పులిహోర’ చేసేయండి ఇలా.!

  • Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..

  • IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions