NTV Telugu Site icon

Vangalapudi Anitha: శాంతి భద్రతల విషయంలో రాజీలేదు.. డ్రగ్స్, గంజాయి లేకుండా చేస్తాం..

Anitha

Anitha

Vangalapudi Anitha: గత ప్రభుత్వంపై మరోసారి ఫైర్‌ అయ్యారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని విమర్శించారు..పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించటంలో గత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు.. భద్రత విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారన్నారు.. ప్రజా ప్రతినిధులు కూడా ప్రజల భద్రత కోసం అంకితభావంతో ఉన్నారన్నారని పేర్కొన్నారు.. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు హర్షణీయమన్నారు.. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.. బుడమేరు వరదలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారన్నారని వెల్లడించారు.. ఇక, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేసేందుకు అన్నీ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..

Read Also: Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..