NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- విజయవాడలో ఎన్ఐఏ సోదాలు..
- టెర్రర్ లింక్స్ కేసులో కీలక దర్యాప్తు..
- తెల్లవారుజామున విజయవాడలో ఎన్ఐఏ దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids: టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నిందితులకు చెందిన ఇళ్లతో పాటు వారికి సంబంధించిన ఇతర ప్రదేశాలను కూడా అధికారులు తనిఖీ చేశారు.
టెర్రర్ లింక్స్ కేసులో ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సుహైల్ బెగ్, మహమ్మద్ రహంతుల్లాను అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసు అనంతరం దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేయడంతో విచారణ మరింత వేగం అందుకుంది. అరెస్టైన ముగ్గురు నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? వారి నెట్వర్క్ ఎంత వరకు విస్తరించింది? అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి నివాసాల్లో మరోసారి సోదాలు నిర్వహించి పలు ఆధారాలను సేకరిస్తున్నారు. టెర్రర్ లింక్స్‌కు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు, స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!