Site icon NTV Telugu

Vasantha Krishna Prasad: జోగి రమేష్‌కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసు..!

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. మైలవరం, పెడన, పెనమలూరు తిరిగి తిరిగి ప్రజలు ఛీ కొడితే ఇప్పుడు మళ్లీ మైలవరం వచ్చాడు అంటూ సెటైర్లు వేశారు.. ఇక, బుడమేరు వరదలపై ఏడాదిలోగా గండ్లు పూడ్చి పనులు చేశాం.. వంద శాతం చెరువులు నింపాం.. అసలు నువ్వు మంత్రిగా ఉన్నపుడు దోచుకోవటం తప్ప మైలవరంకి ఏం చేశావు అని నిలదీశారు.. అయితే, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కౌంటర్ పెట్టి జోగి రమేష్ బూడిద అమ్మిన విషయం అందరికీ తెలుసు అంటూ ఆరోపించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..

Read Also: Madhu Yaskhi : కాళేశ్వరం కుంభకోణం: కవిత, కేసీఆర్‌పై యాష్కీ సంచలన ఆరోపణలు

కాగా, వీటీపీఎస్‌లో ఫ్లయాష్ టెండర్లు రద్దు చేయాలని, అక్రమంగా బూడిద నిల్వ చేసి హైదరాబాద్‌కి తరలించే ప్రక్రియను నిలిపివేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేసిన విషయం విదితమే.. ఈ బూడిద డంపింగ్ యార్డు వల్ల ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని గ్రామాల్లో నీరు, గాలి కాలుష్యం బారిన పడే అవకాశం ఉందన్న ఆయన.. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం నుంచి సురక్షింగా ఉండాలంటే, గ్రామాలను ఆదుకోవాలి, చెట్లు పెంచాలని కోరుతున్నాం, తక్షణమే అక్రమ డంపింగ్ ను స్వాధీనం చేసుకోకపోతే మా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. లోకల్ లారీ ఓనర్స్ ను ఆదుకునే విధంగా టెండర్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. అలాగే, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెపితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని జోగి రమేష్ మండిపడగా.. ఇప్పుడు జోగి రమేష్ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్‌ కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Exit mobile version