NTV Telugu Site icon

MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..

Purandeswari

Purandeswari

MP Purandeswari: అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్‌గా పేరున్న కొల్లం గంగిరెడ్డి.. చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారనే వ్యవహారం.. బీజేపీలో వివాదాస్పదంగా మారందని.. కొందరు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు. ఇక, వైసీపీ నుంచి కొంతమంది బీజేపీలోకి వస్తున్నారనేది ప్రచారం మాత్రమే.. చర్చల దశలోనే ఆ వ్యవహారాలు ఉన్నాయన్నారు..

Read Also: Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?

బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఎవరైనా బీజేపీలోకి వస్తానంటే ఆలోచిస్తాం.. వచ్చినవారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేశారు పురంధేశ్వరి.. ఎవరు పార్టీలో చేరినా, ముందు జిల్లా కార్యవర్గంతో చర్చించాలి, జిల్లా కార్యవర్గం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటామని తెలిపారు.. మరోవైపు.. మా కార్యకర్తలు, నాయకులు, నామినేటెడ్ పదవులు ఆశించడంలో తప్పులేదన్నారు.. నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. టీటీడీ చైర్మన్ పదవిని బీజేపీ ఆశిస్తుందనేది బయట జరుగుతున్న ప్రచారమే, అందులో వాస్తవాలు లేవన్నారు.. ఏదైనా ఉంటే చర్చలు పూర్తవ్వగానే మీడియాకు చెబుతాం అన్నారు.

Read Also: Health tips : మీకు ఈ లక్షణాలుంటే షుగర్ వ్యాధి ఉన్నట్లే

ఇక, బీజేపీ ప్రపంచంలో బలమైన రాజకీయ పార్టీగా మారింది అన్నారు పురంధేశ్వరి.. అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లు ఎత్తి వేస్తారని, రాజ్యాంగాలు మార్చేస్తారని దుష్ప్రచారం చేశారని.. అందుకే 2024 ఎన్నికల్లో అనుకున్న దానికంటే ఓ పది సీట్లు తగ్గాయన్నారు.. కార్యకర్తల బలం కూడా రోజు రోజుకి పెరిగింది… 2014 లో 11 కోట్ల మంది సభ్యులు బీజేపీ పొందింది… 2019 లో 18 కోట్ల మంది సభ్యులుగా చేరారు.. ఏపీ లో 35 లక్షల మంది సభ్యత్వాలు పొందారని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో మళ్లీ సభ్యత్వాలు నమోదు చేస్తున్నాం.. సెప్టెంబర్ 2న 5 గంటలకు బీజేపీ తొలి సభ్యత్వాన్ని ప్రధాని మోడీ తీసుకుంటారు.. సభ్యత్వాలు పూర్తి అవగానే కార్యవర్గ అంశాలు పరిష్కరిస్తాం అన్నారు. ప్రజల వద్దకు బీజేపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి..