డయాబెటిస్ వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలను ప్రీడయాబెటిస్ సింప్టమ్స్ అంటారు.
అయితే కొంతమందిలో మాత్రమే కింద పేర్కొన్న వాటిలోని అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
మరి కొందరిలో మాత్రం వీటిలో కొన్ని రకాల లక్షణాలు మాత్రమే బయటపడుతాయి. అసలు లక్షణాలేంటో చూద్దాం.
మధుమేహం వచ్చే ముందు కొందరిలో జుట్టు రాలుతుంది. అయితే జుట్టు రాలిందంటే కచ్చితంగా మధుమేహం ఉన్నట్లు కాదు. సంబంధిత పరీక్షలు చేయించుకుంటే ఈ విషయంలో కచ్చితత్వం వస్తుంది.
డయాబెటిస్ బారిన పడిన కొత్తలో కొందరిలో అలసట పెరుగుతుంది. రోజంతా అలసటగా ఉంటుంది. పని చేసినా, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది.
కొందరికి మధుమేహం సోకితే చర్మంపై మచ్చలు వస్తుంటాయి. ఇలా చర్మంపై మచ్చలు కనిపిస్తే షుగర్ సంబంధ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
ఇంకా కొంత మందిలో మధుమేహం బారిన పడినప్పుడు తరచూ మూత్రం వస్తుంది. మూత్రానికి వెళ్లినా కొద్ది దాహం వేస్తుంది. నీళ్లు తాగినా కొద్ది యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది.
కొంత మందిలో పై లక్షణాలతోపాటే అదనంగా తరచూ తలనొప్పి వస్తుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పడుతాయి.