Satya Kumar Yadav: డాక్టర్ సమరం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్.. అప్పట్లో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం..!
- డాక్టర్ సమరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం..
- 218వ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్..
- జీవితంలో అందరూ 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు..
- 86 ఏళ్లకు కూడా సమరం రిటైర్ కాలేదు..
- అప్పట్లో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం..
- యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satya Kumar Yadav: డాక్టర్ సమరం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన డాక్టర్ సమరం రాసిన 218వ పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో అందరూ 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు.. కానీ, 86 సంవత్సరాల వయసులో కూడా డాక్టర్ సమరం రిటైర్ కాలేదన్నారు.. వాజ్ పేయ్ కూడా రిటైర్ కాలేదు, అలసిపోలేదు అని ఒక సమావేశంలో చెప్పారని గుర్తుచేసుకున్నారు.. ఇక, ఆరోగ్య శాఖ గురించి తెలియాలంటే ఇన్ని పుస్తకాలు చదవాలా? అని నాకు తెలియదు అంటూ చమత్కరించారు..
Read Also: Janaki V vs State of Kerala: : ఓటీటీలోకి వివాదస్పద సినిమా.. ఎప్పుడంటే?
Also Read
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
218 పుస్తకాలు రాసారు డాక్టర్ సమరం.. ఆధునిక రోజులలో కూడా మాట్లాడటానికి ఆలోచిస్తున్న అంశాలను డాక్టర్ సమరం పదుల సంవత్సరాల క్రితమే చెప్పారు.. సైన్స్ గురించి విస్తారంగా తెలిసిన వ్యక్తి డాక్టర్ సమరం అని ప్రశంసలు గురిపించారు సత్యకుమార్.. బ్లడ్ కి ఆల్డర్నేట్ లేదనుకుంటుంటే.. ఆర్టిఫిషియల్ బ్లడ్ సెల్స్ వస్తాయనుకుంటానన్న ఆయన.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టడం వలన సమరం గారికి గోరా గారు ఆ పేరు పెట్టారు అని గుర్తుచేశారు.. అయితే, ఈ రోజుల్లో పేరు పెట్టాలంటే రప్పా రప్పా అని పెడతారేమో..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటివి పెట్టడం సరైనది కాదు.. ఏదో ఒక సరైన ఉద్దేశంతో చేయాలన్నారు.. ఇక, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక టెక్నాలజీ అభివృద్ధి చాలా వేగంగా జరిగిందన్నారు..
Read Also: Gachibowli: గచ్చిబౌలిలో పిడుగు.. భయబ్రాంతులకు గురైన జనం..!
ఆరోగ్య రంగంలోనే 25 యూనికార్న్ లు మన దేశంలో ఉన్నాయి.. యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం అన్నారు మంత్రి సత్య కుమార్.. గతంలో చాటుగా స్వాతి బుక్ చదివేవాళ్లం అంటూ.. గతంలో పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.. అయితే, ఇప్పుడు నేను వెళ్లే ప్రతీ కార్యక్రమంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై మాట్లాడుతాను అని తెలిపారు.. ఇక, డాక్టర్ సమరం, వారి సోదరుడు, సోదరి పేర్లను వారి తండ్రి గోరా గారు పెట్టిన పేర్లను చూస్తేనే.. ఆయన ఎంత అభ్యుదయ వాదో అర్థం అవుతుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!