Site icon NTV Telugu

Kesineni Nani vs Kesineni Chinni: తన తమ్ముడిని టార్గెట్‌ చేసిన కేశినేని నాని.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు..!

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani vs Kesineni Chinni: బెజవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. ఆయన సోదరుడు ప్రస్తుత బెజవాడ ఎంపీ కేశినేని చిన్న మధ్య ఎప్పటి నుంచో వివాదాలు నడుస్తున్నాయి.. గత ఎన్నికలకు ముందు అవి మరింత తీవ్రరూపం దాల్చాయి.. వైసీపీ నుంచి అన్న కేశినేని నాని పోటీ చేస్తే.. టీడీపీ నుంచి తమ్ముడు కేశినేని చిన్ని బరిలోకి దిగి విజయం సాధించారు.. అయితే, ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడును సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేస్తూ.. తన సోదరుడు ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు..

Read Also: PSR Anjaneyulu Arrest: ముంబై నటి జత్వానీ కేసు.. సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!

విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కు భూమిని కేటాయించడం చంద్రబాబు తీసుకున్న దార్శనిక చర్య.. ఇటువంటి కార్యక్రమాలు నిజమైన పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టికి ఉపయోగం.. అయితే, రూ. 5,728 కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి కొత్తగా ఏర్పడిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాల సమాంతర భూమి కేటాయింపు సరికాదన్నారు కేశినేని చిన్ని.. ఈ సంస్థ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ రూపొందించిన బినామీ మరియు మోసపూరిత పథకంగా ఆరోపించిన ఆయన.. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి కేటాయింపుకు కొన్ని వారాల ముందు స్థాపించబడింది.. దీనికి గత అనుభవం లేదు, విశ్వసనీయ నేపథ్యం లేదు.. సంస్థ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్, MPకి చాలా కాలంగా సహచరుడు మరియు ఇంజనీరింగ్ కళాశాల క్లాస్‌మేట్.. గతంలో ఇన్వెస్ట్‌మెంట్స్ & ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అపఖ్యాతి పాలైన కంపెనీలో అతని మాజీ వ్యాపార భాగస్వామి.. ఈ కంపెనీ ప్రజల నుండి కోట్లు వసూలు చేసి, చాలా మంది అమాయక కొనుగోలుదారులను మోసం చేసి మూసివేసిందని పేర్కొన్నారు..

Read Also: CM Chandrababu: నేడు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. ఢిల్లీ షెడ్యూల్ ఇదే!

ఇక, కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని) స్వయంగా ఉర్సా వెనుక దాగి ఉన్న శక్తి అని, పెట్టుబడి ముసుగులో ఈ భూ ఒప్పందాన్ని ముందుకు తీసుకురావడానికి ఎంపీగా మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన ప్రభావాన్ని ఉపయోగించారని విమర్శించారు కేశినేని నాని.. ఎంపీ కేశినేని చిన్ని.. ఇసుక, బూడిద, కంకర మైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ మాఫియాలలో లోతైన ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. ఈ పనుల్లో మంత్రి నారా లోకేష్ పేరును బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.. అవినీతి ప్రయోజనాల కోసం మీ నాయకత్వాన్ని మరియు పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తన తమ్ముడు, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారాన్ని తీసుకెళ్లారు మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని..

Exit mobile version