Site icon NTV Telugu

Jogi Ramesh: ముగిసిన జోగి రమేష్‌ సీఐడీ విచారణ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు 10 మంది నిందితులు సీఐడీ విచారణకు హాజరయ్యారు.. గంటపాటు జోగి రమేష్‌ను విచారించారు సీఐడీ అధికారులు.. ఇక, విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను.. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.. రెడ్ బుక్ శాశ్వతం కాదు.. ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. మంచి చేస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది.. లేకపోతే ఉండదు అనే విషయం తెలుసుకోవాలన్న ఆయన.. జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.. ఎల్లకాలం కూటమి అధికారంలో ఉంటుందని అనుకోవద్దు.. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు.. ఇది మోసాల ప్రభుత్వం.. సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అని స్పష్టం చేశారు.

Read Also: IDBI: ఐడీబీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్స్.. భారీగా జీతం.. అర్హులు వీరే!

సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సీఐడీ అధికారుల ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చాను.. సీఐడీ అధికారులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పాను అన్నారు జోగి రమేష్.. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద నిరసన కోసమే వెళ్లాను.. నేను దాడి చేయలేదు.. నా కారు అద్దాలు పగలకొట్టి.. మా వాళ్లపై టీడీపీ నేతలు దాడి చేశారు.. మేం ఎవరిపై దాడి చేయలేదు.. నిరసన తెలపడం కోసమే వెళ్లాం.. సీఐడీ నోటీసులతో భయటపెట్టాలని చూస్తున్నారు.. నేను ఎవరికి భయపడను.. వైఎస్సార్‌ శిష్యుడిని.. నేను నిక్కర్లు వేసిన నాటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నాను. 10 నెలల కాలంలో అట్టడుగు స్థానానికి టీడీపీ వెళ్లిపోయిందన్నారు..

Read Also: Akkada Ammayi Ikkada Abbayi Review: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తే ఇదంతా తాత్కాలికం అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు జోగి రమేష్.. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారు, దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు.. పీఠంపై కొడుకు ఎక్కాలా..? దత్త పుత్రుడు ఎక్కాలా..? అనేది రాష్ట్రంలో నడుస్తుందన్నారు.. ఇవన్నీ ఎప్పటి కేసులు.. ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు అని ఫైర్‌ అయ్యారు.. మమ్మల్ని ఏమి చేయలేరు మళ్లీ అధికారంలోకి వస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్..

Exit mobile version