Kanaka Durga Temple: బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమల్లోకి కొత్త రూల్స్..
- కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి కఠిన నిబంధనలు..
- దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి..
- లేకుంటే ఆలయంలోకి అనుమతి లేకుండా కొత్త రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు.. అమ్మవారి ఆలయంలో సెల్ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ఆలయ సాంప్రదాయాలకు భంగం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు అధికారులు. ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ సెల్ఫోన్లను ఆఫీసులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు, ఉద్యోగులందరికీ సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు. స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు నిర్వహించనున్నారు.
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ఇటీవల ఆలయ పాలకమండలి సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేకించి శరన్నవరాత్రుల కాలంలో లక్షలాది భక్తులు తరలివస్తారు.. ఆ సమయంలో భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ వస్త్ర విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇదే నమూనాను కనకదుర్గమ్మ ఆలయంలోనూ అమలు చేస్తే ఆలయ మర్యాదలు మరింత పెరుగుతాయి అని అ సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. ఈ మేరకు దేవాదాయ శాఖ, ప్రభుత్వ అధికారి స్థాయిలో చర్చలు జరిపారు.. గత కొద్ది రోజులు నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిపిస్తూ దుర్గగుడిలో సంప్రాయాదాయ దుస్తుల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు.. భక్తులు ఆలయ దర్శనానికి వచ్చే సమయంలో పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించాలి. మహిళలు చీర, హాఫ్ సారీ లేదా సంప్రదాయ రీతిలో ఉండే వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!