NTV Telugu Site icon

Daggubati Purandeswari: చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే పనులు..

Daggubati Purandeswari

Daggubati Purandeswari

Daggubati Purandeswari: సీఎం చంద్రబాబుకు కేంద్ర లేఖ రాసింది.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయన్నారు బీజేపీ ఎంపీ.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులతో సమావేశం అయిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానం అన్నారు.. ప్రధాని మోడీ సారథ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు.. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు వంటి అంశాలను మోడీ ధైర్యంగా అమలు చేశారు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది.. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు..

Read Also: Chiranjeevi: ఆయన మరణం తీవ్ర మనోవేదనకు గురిచేసింది: చిరంజీవి

అమరావతి రాజధాని అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది అని మరోసారి స్పష్టం చేశారు పురంధేశ్వరి.. 2500 కోట్లు నేరుగా నిధులు కూడా గతంలో మంజూరు చేసింది.. ఔటర్‌ రింగ్ రోడ్ నిర్మాణానికి 20 వేల కోట్లు.. డీపీఆర్‌ ఓకే చేశారు.. ఇంటర్నల్‌ రోడ్ల విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు.. అమరావతి ఏపీ రాజధాని కాబట్టే కేంద్రం కూడా ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.. రైల్వే జోన్ విషయంలో గత ప్రభుత్వం అనుకూలమైన ప్రదేశం ఇవ్వలేదు.. ఆ స్థలం మార్చాలని కోరినా గత ప్రభుత్వం స్పందించలేదు.. ఇప్పుడు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.. ఆమోదం రాగానే రైల్వే జోన్ పనులు జరుగుతాయని తెలిపారు.. పోలవరం విషయంలో తెలిసీ తెలియని పరిస్థితులు కొన్ని ఉత్పన్నం అయ్యాయి.. నిర్మాణం అయిన డయాఫ్రంవాల్ దెబ్బ తినడం బాధాకరం అన్నారు. నీటి నిల్వకు ఆ ప్రాజెక్టు నిలిచే పరిస్థితి లేదు.. ఇప్పుడు డయా ఫ్రం వాల్ నిర్మాణానికి 990 కోట్లు కేంద్రం ఇస్తుందన్నారు.. ఏపీ అభివృద్ది కోసం బీజేపీ వేల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తుచేశారు.. కూటమి ప్రభుత్వం సారధ్యంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందడం ఖాయం అని తెలిపారు పురంధేశ్వరి..

Show comments