Child Trafficking Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసి పిల్లల విక్రయ ముఠా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన కవిత ప్రతాప్ జాదవ్ ను ముంబైలో థానేలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ముంబై కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడకు తీసుకు వస్తున్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మకు ముంబైకి చెందిన అనిల్ కైర్ సహకరించాడు. కిడ్నాప్ కేసులో అరెస్టై జైల్లో అనిల్ ఉన్నాడు. అనిల్ కోసం పిటి వారెంట్ ను పోలీసులు దాఖలు చేశారు. ఇక, కోర్టు అనుమతి ఇవ్వటంతో అనిల్ ను ముంబై నుంచి ఏపీ పోలీసులు తీసుకు రానున్నారు. ఇంకా పరారీలో ముంబై ముఠాలో ఉన్న నూర్, సతీష్, ఢిల్లీ ముఠాకి చెందిన కాజల్, ప్రియాంకల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు. అయితే, ఈ పిల్లల విక్రయం కేసులో అరెస్టుల సంఖ్య 14కి చేరుకుంది.