Srishti Fertility Centre Surrogacy Scam: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసి పేరిట మోసాలకు పాల్పడుతున్న ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటితో డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. డాక్టర్ నమ్రత చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేశారు. ఐదు రోజల పాటు విచారించిన పోలీసులు.. ఆమె నుంచి విషయాలను రాబట్టారు. ఇక ఈరోజు A3 కల్యాణి, A6 సంతోషిల కస్టడీ…
Srushti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితురాలు కల్యాణి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ మోసాల్లో మేనేజర్ కల్యాణి కీ రోల్ పోషించినట్లు సమాచారం.
Child Trafficking Case: హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి వందన అనే మహిళను అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాదులో అమ్మినట్లు గుర్తించారు.
ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.