AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన తుది నివేదిక విడుదలైంది. మొత్తం 3,189 సర్పంచ్, 25,057 వార్డు సభ్యుల స్థానాలకు నవంబర్‌లో నిర్వహించిన పోలింగ్‌లో సగటున 77.65 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 83.37 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 58.85 శాతం ఓట్లు పోలయ్యాయి.
మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సుల ధ్వంసం, బ్యాలెట్ పత్రాలను చించివేయడం, ఇంకు పోయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో మూడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఒకటో వార్డు స్థానానికి, అదే మండలంలోని గరికపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రీపోలింగ్ జరగనుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఏడో వార్డు స్థానానికి కూడా మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మూడు చోట్ల రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్ జరగనుంది. ఇక, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు..
Also Read
- AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
- Vijayawada: వంగవీటి రాధా ప్రమాణ స్వీకారం వేళ కూటమిలో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా!
- AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. ఫేజ్-IIలో 25 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!